పెద్ద శంకరంపేటలో ఘనంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

పెద్ద శంకరంపేట ఎంఈఓ డి. వెంకటేశం
ఘ‌నంగా మ‌హిళా ఉపాధ్యాయుల దినోత్స‌వం
ప‌లువురు ఉపాధ్యాయురాళ్ల‌కు స‌న్మానం

పెద్ద శంకరంపేట, జ‌న‌వ‌రి 3 సిరి న్యూస్: భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పెద్ద శంకరం పేట (Pedda Shankarampet) ఎంఈఓ డి. వెంకటేశం అన్నారు. శుక్రవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి, మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Women Teacher’s Day ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాళ్ల‌కు ఆయన సన్మానించారు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధిరాములు, సిబ్బంది సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.