వారిని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సంచార చేపల విక్రయ వాహన ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, జనవరి 23 సిరి న్యూస్ః మహిళలు,మహిళల సంఘాలు వ్యాపార రంగంలో రాణిస్తూ కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండల కేంద్రం లో లక్ష్మి జె.యల్.జి సభ్యురాలైన సంగీత కు సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభిస్తూ, మహిళలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయ వాహనాన్ని 60% సబ్సీడి తో పి.యం.యం.యస్.వై స్కీమ్ కింద మహిళలకు అందిస్తూ NITHM లో శిక్షణ అందించి సూచీ శుభ్రత నాణ్యమైన చేపలను, చేపల ఉప ఉత్పత్తులు (ఫిష్, ఫిష్ పకోడా, ఫిష్ 65, ఫిష్ కట్లెట్, పత్రా రి మిర్చి, ప్రాన్స్ పలావ్, అపోలో ఫిష్, ఫిష్ ఇన్ హాట్ గార్లిక్, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ స్కీవర్ వంటి స్నాక్స్) తయారు చేసి జన సంచారం కలిగిన ప్రదేశాలలో అమ్ముకొని లబ్ది పొందాలని అన్నారు.
మహిళలు వ్యాపారములో రాణించడం కోసము మహిళా శక్తి ద్వారా మహిళా క్యాంటీన్ ల ఏర్పాటు, స్కూల్ యుని ఫార్మ్స్ కుట్టే బాధ్యత, కుసుమ స్కీమ్ ద్వారా సౌర శక్తి యూనిట్ లను నెలకొల్పడం, వ్యవసాయా అనుభందమైన పాడి గేదెల యూనిట్ లను అందించడం, పౌల్ట్రీ మదర్ యూనిట్స్, పెరటి కోళ్ళ పెంపకం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల నెలకొల్పడం వంటి కార్యక్రమాల ద్వారా లబ్ది పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్, అడిషనల్ డి ఆర్ డి ఓ మధుసూదన్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాసుదేవ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, బిక్షపతి, సీసీలు తిరుపతి, శివ చరణ్ సింగ్, రాజు, రవీందర్, అశోక్, శ్రీలత, మండల అధ్యక్షురాలు మమత, మంగాదేవి, అంజలి పాల్గొన్నారు