తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసిషన్ డైరీ, నూతన సంవత్సరం కేలండర్ ఆవిష్కరణ..
రామచంద్రపురం: భారతి నగర్ డివిజన్ ఏంఐ జి కాలనీ లో గల సీనియర్ సిటిజన్స్ భవన్ లో గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసిషన్ వారు ఏర్పాటు చేసిన 2025 వ సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో ఆర్థిక వెనుకబడిన సుమారు 241 భేల్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది అని గుర్తు చేశారు. సీనియర్ సిటిజన్స్ కు ఏటువంటి సమస్య ఉన్న వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం భేల్ యూనియన్ నాయకులు రాజు నాయక్,సీనియర్ సిటిజన్స్ సభ్యులు వైకుంఠ రావు,రామ రావు,వెంకట్ రెడ్డి,దేవేంద్ర చారీ,రాధ కృష్ణ, సత్యనారాయణ ఇతరులు పాల్గొన్నారు.