- ఏడాది పాలనలోనే మెదక్ లో మెడికల్ కళాశాల తెచ్చాం
- పడేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం
- మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
పదేండ్ల బిఆర్ఎస్(BRS) పాలనలో మెదక్ నియోజక వర్గాన్ని అన్ని రకాలుగా పూర్తిగా భ్రష్టుపట్టించారని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్(MLA Rohith) ఆరోపించారు. సోమవారం మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ లోని మెడికల్ కళశాల(Medak College)ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహింతరు. అనంతరం విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో తరగతుల ప్రారంభం కావాలనే లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకం క్రింద క్యాంటిన్ ను ప్రారంభించారు.

ఎమ్మెల్యే వెంట జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul), ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివదయాల్(Suprintendent Shivadayal), కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో మెడికల్ కళాశాలకు కేవలం కొబ్బరికాయలతో సరిపెట్టారని ఆయన ఎద్దేవ చేశారు. అంతే కాకుండా నియోజక వర్గాన్నికి ఏ మాత్రం కూడా ఒరగబెట్టింది ఏమి లేదని ఆయన పేర్కోన్నారు.
తన హయాంలో విద్యా, వైద్య రంగంలో మెదక్ ను ముందుంచుతానని, నియోజక వర్గాన్ని దశల వారీగా అభివృద్ధి పర్చడమే కాకుండా విద్యా, వైద్య రంగంలో మెదక్ ను ముందుస్థానంలో ఉంచుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, కౌన్సిలర్ లు లింగం, దొంతి లక్ష్మి, ఆవారి శేఖర్, లక్ష్మినారాయణ గౌడ్, రాగి అశక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, గాడి రమేశ్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.