అర్హుల‌కు ప‌థ‌కాలు ఎందుకివ్వ‌డం లేదు? అధ‌కారుల‌ను నిల‌దీసిన గ్రామ‌స్థులు

అందోల్‌, జ‌న‌వ‌రి 23 సిరి న్యూస్ః రేషన్ కార్డుల‌, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు స్వీకరణ భాగంగా గ్రామ ప్రజలందరూ మున్సిపల్ చైర్మన్మల్లయ్య , వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి , మార్పెడు రాష్ట్ర డైరెక్టర్ శేరి జగన్మోహన్ రెడ్డి , మున్సిపల్ సిబ్బందిని నిల‌దీశారు పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని వచ్చిన వారికి అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి లేనివారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు తిరగబడ్డారు.

ఈ ప్రజాపాలన కార్యక్రమం ఫస్టు డబల్ బెడ్ రూమ్ ఎంక్వయిరీ రేషన్ కార్డ్ ఎంక్వయిరీ చేసిన తర్వాతనే మీరు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవాలని గ్రామ ప్రజలు అన్నారు. అంతేకాకుండా గ్రామ ప్రజలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ పాలలో మీరే ఉన్నవారికి డబల్ బెడ్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి మీరే మారి మళ్ళీ మీరే వస్తాయని జనాలను నమ్మిస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమని గ్రామ ప్రజలు తిరగబడ్డారు మళ్లీ ఒకవేళ మాకు దరఖాస్తు తీసుకొని ఇల్లు రాకుండా రేషన్ కార్డు రాకుండా మళ్ళీ మీరు ఓట్లు అడగడానికి ఎలా వస్తారని అధికారులను నిల దీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్, వార్డ్ ఆఫీసర్ నాగయ్య, తుపాకుల శివ, RP రొయ్యల అనిల్, మరియు మెడికల్ క్యాంప్ వారు, మంజుల ANM, ఆశ వర్కర్ వీరమని, అంగన్వాడీ టీచర్ బాలమణి తదితరులు పాల్గొన్నారు.