బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్
జనవరి 28 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : సంగారెడ్డి- కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను బీసీ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ భూస్వామ్య దొరల అకృత్యాలపై పోరు సలిపి భూస్వాములపై తిరుగుబావుటకై గల మెత్తి పెత్తం దారుల అణిచివేతపై ఆకలి పొధై నిలిచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను హంతకుడు అని హంతకునికి పద్మశ్రీ ఇవ్వమని చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.సందర్బంగా దళిత సంఘాల నాయకులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆనంతయ్య, అనంతయ్య మాట్లాడుతూ సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గద్దర్ ను అవమానించిన బండి సంజయ్ తెలంగాణా సమాజానికి క్షమాపణ చెప్పాలని తన వైఖరి ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అశోక్, , జైపాల్ నాయక్,పోతు రాజు పవన్,ప్రకాష్రాథోడ్ ఇమ్మయ్య, నిజాముద్దీన్, బాబర్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.