ఝరాసంగం జనవరి 7 సిరి న్యూస్ : సంక్రాంతి పండుగ (Sankranti festival) సందర్భంగా పతంగి అమ్మకందారుల అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 సెక్షన్ 5 ప్రకారం చైనా మాంజా(China Manja)ను నిషేధించడం జరిగిందని ఎస్.ఐ టి. నరేష్ అన్నారు. మంగళవారం మండల పతంగి అమ్మకల షాపులను పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా షాప్ యజమానులతో మాట్లాడుతూ చైనా మంజను అమ్మినచో ఈ చట్టం ప్రకారం ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా తో పాటు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం సెక్షన్ 51 ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్ష, పదివేల రూపాయలు జరిమానా కలదు అన్నారు.