సంగారెడ్డి : సంగారెడ్డిలో ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకుల మీడియా సమావేశంలో ప్రభు గౌడ్ మాట్లాడుతూ.. బీసీలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపుమేరకు సంగారెడ్డి లోని బీసీ కార్యాలయం వైయస్సార్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, చెదురుపా ప్రభు కూడా ఆధ్వర్యంలో బీసీ నాయకుల మీడియా సమావేశంలో ప్రభు గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ బీసీలను అడ్డుపెట్టుకొని తన స్వప్రయోజనాల కోసం సభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీ ఉద్యమాలలో ఏనాడు పాల్పంచుకొని అతను తన సొంత లాభాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కిష్టయ్య గోకుల్ కృష్ణ, సుధాకర్ గౌడ్, రాజు యాదవ్, వికాస్, శేఖర్, దాసు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్