ఆందోళనకు గురవుతున్న రైతులు..
వెల్దుర్తి : వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న శంకరంపేట్ వెల్దుర్తి మండలాల మధ్యలో నుంచి పారుతున్న పసుపేరు వాగులో నిర్మించిన చెక్ డ్యాములు(Check dams) ఒకచోట నిండుగా మరోచోట నీళ్లు లేక బోసిపోతున్న చెక్ డ్యామ్ సుమారు 600 ఎకరాలకు నీరును అందించే చెక్ డాం లో నీరు లేక బోసిపోతుంది అదే పస్ పేరు వాగుపై ఆరెగూడెం గ్రామపంచాయతీ దగ్గర గల చెక్ డ్యాములో నీటితో నిండుగా ఉండడం గ్రామ రైతులని ఆందోళన గురిచేస్తుంది.
ఒకవైపు నాట్లు వేయడం సమయం రావడంతో చెక్ డ్యామ్లో నీరు ఇంకిపోవడంతో చుట్టుపక్కల రైతులు ఆందోళనకు గురవుతున్నారు మొన్నటి వరకు నిండుకుండలా ఉన్న చెక్ డ్యాము ఒకేసారి నీరు మొత్తం ఇంకిపోవడంతో చుట్టుపక్కల రైతాంగం వరి నాట్లు వేస్తే పంట పండుతుందా లేదా అని భయాందోళనలు చెందుతున్నారుఇట్టి విషయమై మండల ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్ను వివరణ కోరగా ఎందుకలా జరిగిందో చూస్తున్నామని ఏమైనా లీకేజీ ఉన్నాయని చూస్తున్నామని మీడియాతో తెలపడం జరిగింది కానీ చుట్టుపక్క రైతాంగం మాత్రం డ్యాంలో నీళ్లు లేకపోవడంతో వరినట్లు విషయమే ఆందోళన చెందుతున్నారు.