స్వామి వివేకానందునికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ అభ్యర్థి డా.సి అంజి రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి
సంగారెడ్డి, జనవరి. 12 ( సిరి న్యూస్ ) : స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబి వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి ఉమ్మడి మెదక్ నిజాంబాద్ కరీంనగర్ అదిలాబాద్ గ్రాడ్యుయేషన్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్,సి అంజి రెడ్డి, బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి తరానికి భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
యువతలో ఆధ్యాత్మిక మరియు జాతీయ వాదానికి మేల్కొల్పిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు రాజశేఖర్ రెడ్డి వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు డాక్టర్ రాజు గౌడ్ బిజెపి సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి బిజెపి జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ ఎల్లన్న మీనా గౌడ్ పుల్లంగారి సురేందర్ అశ్వంత్ శ్రీకాంత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అజయ్ తులసి ప్రకాష్ రెడ్డి సాయి రెడ్డి అభినవ్ ఆనంద్ చంద్రశేఖర్ ఆదిత్య సతీష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.