ఎవరిని అడిగి సర్వే చేస్తున్నారు?: క‌ల్వ‌కుంట గ్రామ‌స్థులు ఆగ్ర‌హం

Villagers of Kalwakunta who obstructed the road survey work
Villagers of Kalwakunta who obstructed the road survey work

రోడ్డు సర్వే పనులను అడ్డగించిన గ్రామస్తులు..
మేము పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే..
ఇప్పుడు వచ్చి రోడ్డు కోసం ఇల్లు కూల్చి వేయమంటారా..
మా ప్రాణాలు పోయినా సరే స్థలాన్ని వదిలేది లేదు..
ఏ అధికారులు వస్తారు.. ఏ ఎమ్మెల్యే వస్తాడు..రమ్మనండీ..
మేము మాట్లాడుతాం అంటూ శాంతిన‌గ‌ర్ క‌ల్వ‌కుంట గ్రామ‌స్తుల ఆగ్ర‌హం..

సంగారెడ్డి : గత కొన్ని సంవత్సరాలుగా కల్వకుంట గ్రామంలో నివాసం ఉంటున్న మేము ఇప్పుడు రోడ్డు కోసం మా ఇళ్లను కూల్చివేస్తారా…. అంటూ క‌ల్వ‌కుంట గ్రామ‌స్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంగారెడ్డికి చెందిన శాంతినగర్ నూతన బస్టాండ్ సమీపం లో నుండి ఐఐటి వరకు 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల కోసం అధికారులు శ‌నివారం సర్వే చేసేందుకు గ్రామానికి వ‌చ్చారు. మెయిన్‌ రోడ్డు నుంచి దుకాణ సముదాయముల వరకు 80 ఫీట్లు, అలాగే కల్వకుంట్ల గ్రామంలో 50 ఫీట్లు రోడ్డు విస్తరణ పనుల కోసం మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్థులు అడ్డుకున్నారు. ఈసంద‌ర్భంగాగ్రామానికి చెందిన రామా గౌడ్మ, మ‌ల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, అసలు ఇక్కడ రోడ్డు లేదు. ప్రభుత్వానికి సంబంధించిన రోడ్డు లేనే లేదు. ఇప్పుడు రోడ్డు కోసం మున్సిపాలిటీ వాళ్లు కొలతలు తీసుకుంటున్నారు మిమ్మల్ని ఎవరు పంపించారు?..ఈ రోడ్డు మార్గం కూడా పట్టాల్యాండే…. మా ప్రాణాలు పోయినా సరే స్థలాన్ని వదిలేది లేదు. మీకు రోడ్డు కావాలనుకుంటే వెనుక వైపు నుంచి వేసుకోండి. మా ఇళ్ల‌ జోలికి రాకండి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీకు రోడ్డు కావాలనుకుంటే కలకుంటే వెనకాల వైపు నుంచి వేసుకోండి ఆ కల్వకుంట గ్రామం నుండి మాత్రం రోడ్డు వేయనివ్వమ‌న్నారు. మా యొక్క ఇండ్లను కూల్చుకోమంటారా?..ఎట్టి పరిస్థితుల్లోనూ కల్వకుంట గ్రామం నుండి ఐఐటి వరకు వేరే మార్గం ద్వారా రోడ్డు వేసుకోవాలని మా ఇళ్లకు ఏమైనా కూల్చివేత లాంటి కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోమని గ్రామస్తులు తెలిపారు.

వ్యాపారం వాణిజ్య షాప్ యాజమాన్యం వారు కూడా మేము తీవ్రంగా నష్టపోతాం..మెయిన్ రోడ్ కమాన్ నుండి కల్వకుంట వరకు శాశ్వతంగా నిర్మాణం చేసుకున్న దుకాణ సముదాయాలు, నివాసాలు,సర్వే చేయడం వల్ల నేను తీవ్రంగా నష్టపోతామని ఎంతో కష్టపడి కట్టుకున్న నివాసాలు ఇప్పుడు వచ్చి సర్వే పేరుతో రోడ్డు వెడల్పులో భాగంగా తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, శాంతినగర్ , కల్వకుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ అధికారులు వస్తారు ఏ ఎమ్మెల్యే వస్తాడు రమ్మనండి మేము మాట్లాడుతాం.. మా యొక్క కల్వకుంట శివారు, అటు పాత బస్టాండ్ వరకు, ఇటు మహిళా ప్రాంగణం వరకు, ఉన్నదని, సంగారెడ్డి లోని, కల్వకుంట శివారు అతిపెద్దదని, కల్వకుంట వ్యవసాయదారులు తెలిపారు. అవసరమనుకుంటే ప్రభుత్వంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని కల్వకుంట్ల శాంతినగర్ వాసులు పేర్కొన్నారు.