మాసాయిపేట : మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో పల్లె దావకాన నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. పల్లె దేవకన్నకు సంబంధించిన స్థానికులు ఏమి తెలియనట్టు కోరుకున్నారు. ఇప్పటివరకు రోగులకు గాని స్థానిక చిన్న పెద్ద ప్రథమ చికిత్స చేయడానికి ఎలాంటి ఉపయోగాలు అందుబాటులోకి రాకపోవడంతో ఎవరు ఏమనకపోవడంతో నిశ్శబ్దంగా ప్రజలు గ్రామంలో బతుకుతున్నారు. గిరిజన తండాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేడు ఇప్పటికైనా బిఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె దావకన్న మంజూరైనప్పటికీ కాంగ్రెస్ ఇప్పుడైతే గెలిచిందో అప్పటినుండి డబ్బులు తీసేసుకొని కాంట్రాక్టర్ పారిపోయినట్లు చూసిన స్థానికులు తెలుపుతున్నారు.
ఇప్పటికైనా లోతట్టు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పథంలో నడిపియాలని కాబోయే సర్పంచులకు విలువలు దక్కాలంటే పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి అభివృద్ధి విషయంలో ముందుండి అధికారులు జిల్లా అధికారులకు తెలిపాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికీ అనంతరం సపై కార్మికులకు మూడు నెలలు అవుతున్నప్పటికీ జీతాలు రాకపోవడంతో గ్రామంలో ఉన్నవారు తోచిన సహాయం చేసుకుంటూ వారితో పనులు కార్యక్రమాలు ముందు ముందు చేయించుకుంటున్నారు. కానీ ఎంత చేసిన వారి జీవితానికి సరిపోవడం లేదని సపై కార్మికుడు యాదగిరి ఆవేదన వ్యక్తపరిచారు.