సంగారెడ్డి, జనవరి 6 సిరి న్యూస్ : హైదరాబాద్ హిమాయత్ నగర్ లో సోమవారం వాసవీ క్లబ్ బుద్దపూర్ణిమ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టీపుల్ వి ఎన్, డా.పుల్లూరి ప్రకాష్ అంతర్జాతీయ స్థాయిలో వాసవి క్లబ్బులు అందిస్తున్న సేవా కార్యక్రమలను వివరిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు గత సంవత్సరము దాదాపు 70 కోట్ల సేవా కార్యక్రమాలు చేసామని తెలిపారు. ఈ సంవత్సరం మరిన్ని సేవాకార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా వాసవీ క్లబ్ బుద్దపూర్ణిమ అధ్యక్షునిగా వి యన్ ,మ్యడం చంద్రశేఖర్ , ప్రధాన కార్యదర్శిగా మంచికొండ రఘుకుమార్, కోశాధికారిగా ఎన్.ఆర్.మురళీకృష్ణ లచే జిల్లా గవర్నర్ వి ఎన్, ఇరుకుళ్ల ప్రదీప్ కుమార్ , ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి, కేబినెట్ సెక్రటరీ వనం నరేందర్, రీజియన్ చైర్మన్ కందుకూరి రమేష్ గుప్తా, వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జా మధుసూధన్, జోన్ చైర్మన్ ప్రొద్దుటూరి వీరభద్రుడు, జిల్లా ఇంచార్జీ చిలమకూరి నరేంద్ర, తధితరులు పాల్గొన్నారు.