సిరి ఫిబ్రవరి 1- హత్నూర : టిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కెసిఆర్ ను శుక్రవారం నర్సాపూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ యువనాయకుడు వనరి గారి శ్రీకాంత్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు టిఆర్ఎస్ పార్టీపై ఉన్న అభిమానం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ఆకర్షితులై చిన్ననాటి నుండి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వనరి గారి శ్రీకాంత్ తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఎంతో ఆదర్శంగా నిలపడానికి మాజీ సీఎం కేసీఆర్ కృషి చేయడం హర్షనీయమన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం మళ్లీ పూర్వ వైభవం సాధించాలని లక్ష్యంతో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి టిఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాధరణ పెంపొందేలా కృషి చేస్తానని తెలిపారు కాగా మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి యువ నాయకులు ఎంతో అవసరమని పార్టీ పూర్వ వైభవం సాధించడానికి యువ నాయకులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ నీ ఆయన అభినందించారు.