అంగరంగ వైభవంగా వైకుంఠపుర రథయాత్ర

సంగారెడ్డి, జనవరి 6 సిరి న్యూస్ : సంగారెడ్డి పట్టణంలో వైకుంఠపుర రథయాత్ర సోమ‌వారం సంగారెడ్డి చౌరస్తా నుంచి ప్రారంభ‌మైంది. మంగ‌ళ‌వారం అనంతపురం వరకు రథయాత్ర కొనసాగుతుంది. రథయాత్రలో భాగంగా సంగారెడ్డి పట్టణవాసులు వైకుంఠపురం రథయాత్రలో పాల్గొని భక్తిశ్రద్ధలతో భజనలు ఆటలు పాటలు కోలాటాలు రంగురంగుల ముగ్గులు వేస్తూ రథయాత్ర కొనసాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వైకుంఠపుర నాధుడి రథయాత్ర చూడడానికి సంగారెడ్డి పట్టణవాసులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ‌య్యింది. పోలీసులు వాహ‌నాల‌ను డైవ‌ర్ష‌న్ చేసి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూశారు.