మరమ్మతులు చేయమంటే బడ్జెట్ లేదు అని చెబుతున్న అధికారులు..
పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్..
మునిపల్లి : మండలంలోని మల్లికార్జున పల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టి నిరుపయోగంగా మారింది. తొట్టి నుంచి నీళ్లు లీకవుతున్నాయి. మరమ్మతులు చేయకపట్టించుకునేవారు లేదు. 10నెలలనుంచి మరమ్మత్తులకు నోచుకోలేదు. దీంతో పశువులను దాహార్తిని తీర్చడానికి ఇబ్బందిగా ఉందని రైతులు, పశువుల కాపరులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా బడ్జెట్ లేదని చెబుతున్నారని గ్రామస్థులు వాపోయారు.
స్పెషల్ ఆఫీసర్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గ్రామసభ దృష్టికి తీసుకెళ్దామన్నా స్పెషల్ ఆఫీసర్ గ్రామసభ నిర్వహించడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి తొట్టిని మరమ్మత్తులు చేయించాలని గ్రామంలోని రైతులు, పశువుల కాపరులు కోరుతున్నారు.