పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలుచేయాలి
నారాయణఖేడ్: జనవరి 28 (సీరి న్యూస్) జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ యూనిఫైడ్ పెన్షన్ విధానం యు పి ఎస్ పై జారీచేసిన నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని వివిధశాఖల ప్రభుత్వ కార్యాలయాలు,పాఠశాలల్లో మరియు కళాశాలల్లో తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో యు పి ఎస్ ప్రతులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా నారాయఖేడ్ డివిజన్ లోని కల్లెర్, మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ మాసంపల్లి, కంగ్టీ, మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ తడ్కల్, నారాయణఖేడ్, మండల్ లోని చాప్టాకే, నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్ లకు చెందిన ఉపాధ్యాయులు నారాయణఖేడ్ ఆర్ డి ఓ ఆఫీస్ సిబ్బంది. నిరసనలో పాల్గొని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ వద్ద యూపీఎస్ ప్రతులను దగ్ధం చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాంచందర్ మాట్లాడుతూ. సి పీ ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని గత దశాబ్ద కాలంగా తీవ్ర పోరాటం చేస్తుంటే ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఈ యుపిఎస్ విధానం తీసుకురావడం అప్రజాస్వామికమని ఇది కేవలం షేర్ మార్కెట్లోకి నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టే విధంగా ఉందే తప్ప, ఈ విధానంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబ- సామాజిక భద్రత కోణం లేదని తీవ్రంగా విమర్శించారు. ఈ విధానం వల్ల ఉద్యోగి తన సర్వీస్ కాలంలో జమ చేసిన ప్రతినెల బేసిక్ ప్లస్ డి ఏ లో 10 శాతం చొప్పున జమ చేసిన సొమ్మును ఎన్పీఎస్ ట్రస్ట్ కు బదిలీ చేసిన తర్వాతనే ఉద్యోగికి సర్వీస్ పెన్షన్ నిర్ణయించడం అనేది అత్యంత దారుణమైన చర్య అని దీన్ని సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు గుర్తు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి మున్నూరు అంజయ్య, జిల్లా కోశాధికారి జొన్నాడ మల్లేశం జిల్లా బాధ్యులు విజయభాస్కర్, ఫరూక్, నాగార్జునరెడ్డ్, అశోక్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు,కళాశాల సిబ్బంది మరియు ఆర్డిఓ ఆఫీస్ సిబ్బంది. ఉద్యోగులు పాల్గొన్నారు.