క్రీడాకారులకు ఏకరూప జెర్సీలు అందజేత

Uniform jersey will be provided to the players
క్రీడాకారులకు ఏకరూప (జెర్సీ డ్రెస్ లు ) దుస్తులు అందజేత

శివంపేట్ : సీఎం కప్ లో భాగంగా మండల స్థాయి ఖో-ఖో పోటీలో గెలుపొంది జిల్లా స్థాయి పోటీకి వెళ్లిన శివంపేట మండల ఖో- ఖో జట్టుకి ( 15 మంది కి )ఏకరూప దుస్తులు ( జెర్సీ డ్రెస్ లు ) లను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త అందచేశారు. ఈ సందర్భంగా నవీన్ గుప్త మాట్లాడుతూ.. రాష్ట్రం లో క్రీడలను , క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడలకు తనవంతు బాధ్యతగా క్రీడాకారులకు ఏకరూప దుస్తులు అందించడం జరిగింది అని చెప్పారు. క్రీడాకారులకు భవిష్యత్తులో ఎలాంటి సహకారం అందించడానికి అయిన సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ నవీన్ గుప్త అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియచేశారు.