సదాశివపేట, జూన్ 6 (సిరి న్యూస్):లారీ ఆటో ఢీకొన్న సంఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. సదాశివపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివపేట మండల పరిధిలోని కంబాలపల్లి చౌరస్తా వద్ద ఎదురెదురుగా లారీ ఆటో ఢీకొన్నది మామిడిపళ్ళను ఆటోలో మార్కెట్ కి తీసుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 13 ఏళ్ల బాలుడు అభిషేక్ సాయికిరణ్ 22 మృతి చెందారు. ప్రమాదంలో నుజ్జు నుజ్జుయి ఆటలో చిక్కుకొని ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సదాశివపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.