TSUTF మునిపల్లి మండల కార్యవర్గం ఏర్పాటు

సిరి న్యూస్: నవంబర్ 29 సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం TGMS మునిపల్లి లో నిర్వహించిన TSUTF మునిపల్లి మండల మహాసభలో భాగంగా అధ్యక్షురాలిగా Y. నిరూపరాణి జనరల్ సెక్రటరీగా D.మునేష్ ఉపాధ్యక్షులు దుర్గయ్య మరియు ప్రగతి, కోశాధికారిగా B. రమేష్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రధాన కార్యదర్శి B. సాయిలు గారు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి V. అనురాధ గారు మరియు మండల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.