గుమ్మడిదల : గుమ్మడిదల మున్సిపాలిటిలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా యుద్దనౌక పాటల పెద్దన్న గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటల గాయకుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. గద్దర్ జీవితమంతా త్యాగాల మాగాణి పోరాటాల సూర్యుడని అన్నారు. ఉద్యమాల తొలిపొద్దు ప్రశ్నించె గోంతుక పాటల పూతోట మలిదశ తెలంగాణ ఉద్యమంలో యావత్ ప్రపంచ స్థాయిలో ఓవేలుగు వెలిగిన దళిత భహుజన ఉద్యమ కేరటం గద్దర్ స్మృతులు యాదిజేసుకోని ఆయన ఆశయాల పల్లకినీ మోసుకెల్తామని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ రైతు సంఘం అధ్యక్షులు సదానంద రెడ్డి, దేవదాయ కమిటీ చైర్మన్ మద్దుల బాల్రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, తుడుం శ్రీనివాస్, జన చైతన్య కళా సంస్థ వ్యవస్థాపకులు.వి.యం.ఎల్లయ్య నీరుడి రమేష్ శివకుమార్ తేలు నరసింహ మాలల హక్కుల సాదన సమితి వ్యవస్థాపకులు బొమ్మల మైసయ్య, రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రతినిధులు మంద భాస్కర్ రెడ్డి. బహుజనగలం రాష్ట్ర అధ్యక్షులు నిరుడు విష్ణువర్ధన్ మల్లెపల్లి ప్రకాష్. బాల్ రాజ్ చేన్నంశెట్టి సూర్యనారాయణ, , ఎండి అన్వర్, రమణ రెడ్డి తదీ తరులు పాల్గోన్నారు.