కలెక్టరేట్ లో సంస్మరణ దినోత్సవం..
సంగారెడ్డి : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల సంస్మరణ ను శహీద్ దివాస్ గా పాటిస్తు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య అమరవీరులకు ఘన నివాళులు ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సమావేశ మందిరంలో గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మజ రాణి నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం ను నిర్వహించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే సంకల్పాన్ని చాటుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భముగా డిఆర్ఓ మాట్లాడుతూ.. దేశానికి గాంధీ మహాత్మా అందించిన త్యాగాన్ని సిద్ధాంతాలను స్మరించుకునే రోజు అని ,జనవరి 30 శహిద్ దివాస్ గా పాటిస్తున్నారని అన్నారు . గాంధీజీ సిద్ధాంతాలు భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. చూపిన మార్గాలు ఈనాటికీ సమాజానికి అవసరమని అన్నారు .అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ పరమేష్ , జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.