సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.బుధవారం మండల పరిధిలోని పోట్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని లబ్ధిదారులు అధైర్య పడవద్దన్నారు. లిస్ట్ లో పేర్లు లేని వారు తప్పని సరిగా ధరాఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుమల రావు, మండల అభివృద్ధి అధికారి సుధాకర్, ఆర్ ఐ రామారావు, ఎపివో రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.