ఆహార భ‌ద్ర‌త కార్డుల ప‌రిశీల‌న‌పై శిక్ష‌ణ‌

జిన్నారం జనవరి 16 (సిరి న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బొల్లారం మున్సిపాలిటీలో గౌరవ చైర్మన్ కోలన్ రోజా రాణి, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు ఆదేశాల మేరకు ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పరిశీలన విషయంపై అధికారులకు శిక్షణ నిర్వహించడం జరిగింది.

ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న 1435 లబ్ధిదారుల దరఖాస్తులు వార్డువారీగా 22 వార్డులకుగాను నియమించిన పరిశీలన అధికారులు పరిశీలించి తయారుచేసిన జాబితాను ఈనెల 21 నుండి 25 వరకు జరుపబోయే వార్డు సభలలో ప్రవేశపెట్టి, వార్డు సభల ఆమోదం పొందిన అనంతరం వాటిని మున్సిపల్ కమిషనర్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది.

తధనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుండి బొల్లారం మున్సిపాలిటీలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని మేనేజర్ మల్లికార్జున స్వామి మరియు రెవెన్యూ ఆఫీసర్ టీ నర్సింలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్ లు, కార్యాలయంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.