పోలీసు టెక్నికల్ సిబ్బందికి వివిధ వర్టికల్ విభాలపై నైపుణ్యతలో శిక్షణ

సంగారెడ్డి, మే 15 (సిరి న్యూస్): జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ పోలీసు స్టేషన్స్, సర్కిల్, డియస్పీ కార్యాలయాలలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతులను గురువారం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న సమాజానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, వివిధ వర్టికల్ విభాగాలలో మంచి ప్రతిభ కనబరచాలని, ఎఫ్ఐఆర్ మొదలుకొని డాటా ఎంట్రీ, ఈ-పెట్టి కేసులు, ఈ చల్లాన్ నమోదు వరకు ఎలాంటి సందేహాలున్న ఈ శిక్షణ ద్వారా నివృత్తి చేసుకోవాలని, శిక్షణ అనంతరం కుండా జిల్లా ఐటి సెల్ సేవలను వినియోగించుకొని, వర్తికల్ విభాగంలో సంగారెడ్డి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఫంక్షనల్ వర్టికల్ మానిటరింగ్ అధికారి, డియస్పీ జహీరాబాద్ రామ్ మోహన్ రెడ్డి, వర్టికల్ కో-ఆర్డినేటర్, ఇన్స్పెక్టర్ డీసీఆర్బీ రమేష్, ఐ.టి సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐ.టి సెల్ సిబ్బంది సజీవ్, చంద్రశేఖర్, రవి, శ్రీకాంత్ వివిధ స్టేషన్ లకు చెందిన టెక్నికల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.