కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు,కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

– దోపిడిదారుల నుండి దేశాన్ని కాపాడుకుందాం
– ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుందాం

సిద్దిపేట : కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు,కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణం లోని అంబేత్కర్ చౌరస్తా పాత బస్టాండ్ వద్ద జాయింట్ ఫ్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్,సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక,రైతు, వ్యవసాయ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. కార్పోరేట్ల ప్రయోజనం కోసం దేశ స్వాతంత్రాన్ని, స్వావలంబనను తాకట్టు పెడుతుందని మన జాతీయ సహజ వనరులు, సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకోగా స్వదేశీ,విదేశీ కార్పొరేట్లకు తెగ నమ్ముతుందన్నారు.

సామాన్యులకు ఆర్థిక భారాలు, పెట్టుబడుదారులకు కార్పొరేట్లకు బడా వ్యాపారస్తులకు లాభాలు కట్టపెట్టే విధంగా మోడీ ప్రభుత్వం కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అనేక త్యాగాలు రక్త తర్పణతో పోరాట సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్చి సమ్మే హక్కులను కాలరాస్తూ, 12 గంటల పని విధానం అమలులోకి చేస్తుందన్నారు.

కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెరిగి శ్రమ దోపిడీకి హద్దె లేకుండా చేసింది.కేంద్ర బిజెపి ప్రభుత్వ వినాశకర చర్యలను కార్మిక వర్గం,రైతంగం, వ్యవసాయ కార్మిక సంఘం ఐక్యంగా ధీటుగా ఎదుర్కోవాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందే అశోక్,రైతు సంగం జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి,కృష్ణారెడ్డి, వ్యాకస జిల్లా నాయకులు తాడూరి రవీందర్,ఎఐటియుసి జిల్లానాయకులు సంపత్,రైతు సంగం నాయకులు కనకచారి, ప్రభాకర్,కనకరాజు,వెంకటేశం,మండల భాస్కర్,వంగ రవీందర్ రెడ్డి,జెర్రీ పోతుల జనార్దన్,కర్ణాల చంద్రం,మల్లేశం, భిక్షపతి,సిద్దేశ్వర్,త దితరులు పాల్గొన్నారు.