కలెక్టర్ ఆదేశాలతో సంగారెడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యా
ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేసిన జిల్లా విద్యాధికారి.
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని ఏపీహెచ్ బి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో పాఠశాల ఆవరణలోని క్రీడా మైదానంలో పనులు చేయిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాల మేరకు ముగ్గురిని సస్పెన్షన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం పాఠశాల సమయంలో పాఠశాల క్రీడా మైదానంలో ఉన్న రాళ్లు ఇతర సామాగ్రిని విద్యార్థుల తో పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పందించారు.
వెంటనే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి ని ఆదేశించడంతో విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి ఇందుకు కారణమైన పాఠశాల కు చెందిన ముగ్గురు ఎస్జిటి ఉపాధ్యాయులు మంజుల, శారద, నాగమణిలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సంబంధిత సమస్యపై కార్మిక శాఖ అధికారులతో విచారణకు కలెక్టర్ ఆదేశించారు.