నర్సాపూర్ జనవరి 22 (సిరి న్యూస్) : ప్రజా పాలన వార్డు సభలు నిర్వహణలో భాగంగా బుధవారం పురపాలక సంఘం నర్సాపూర్ పట్టణ పరిధిలోని 06, 08, 10 మరియు 13 వ వార్డులలో నిర్వహించారు కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో వార్డు సభలు జరిగాయి కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన జాబితాలో ఉన్న లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు జాబితాలో లేని వారు మరల దరఖాస్తు చేసుకోవాలని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు.
పురపాలక సంఘం చైర్మన్ దుర్గప్ప అశోక్ గౌడ్ హాజరై.వారు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డులు పేరు నమోదు లేదా నూతన రేషన్ కార్డు కొరకు వార్డు సభల యందు లేదా మున్సిపల్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు సమర్పించాలని తెలియజేసినారు. ఈ వార్డు సభలలో మున్సిపల్ కమిషనర్ శ్రీ పి. రామకృష్ణ రావు మేనేజర్ శ్రీ వి.మధుసూదన్ వైస్ చైర్మన్ ఎండి నయుముద్దీన్ కౌన్సిలర్లు పంబల రామచందర్ , బుచ్చెష్ యాదవ్ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ లింగం జూనియర్ సహాయకులు శ్రీనివాస్ ,వార్డు అధికారులు, పురపాలక సంఘం సిబ్బంది పాల్గొనడం జరిగింది.