కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మోహన్నగారి రాజిరెడ్డి
గజ్వేల్ జనవరి 22(సిరి న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజిరెడ్డి, వార్డ్ ఇంచార్జ్ మామిడి కృష్ణ అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో నిర్వహించిన వార్డు సభలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అభివృద్ది చేస్తున్నారని వారు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరాలు గడిచిన ప్రజలకు రేషన్ కార్డులు అందించకుండా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తుందని పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి వివిధ పథకాలు వర్తింప చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చెర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, కమీషనర్ గోల్కొండ నరసయ్య అధికారులు, వార్డు కౌన్సిలర్ మామిడి విద్య రాణి శ్రీధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.