మీలో మార్పు రావాలి.. మళ్లీ వస్తాను – ఆర్డీవో జయ చంద్రారెడ్డి

తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడిచుకోవాలి
పదవ తరగతిలో ఉత్తీర్ణులై మంచి పేరు ప్రతిష్టలు తేవాలి
విద్యార్థులకు మోటివేష‌న్‌ క్లాస్ తీసుకున్న ఆర్డీవో జయ చంద్రారెడ్డి
ఈసారి పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరగాలని ఉప‌ధ్యాయుల‌కు సూచించిన ఆర్డీవో

మనోహరాబాద్. జనవరి 4 సిరి న్యూస్ : ఉన్నత చదువుల కోసం మీలో మార్పు రావాలి… మళ్లీ వస్తాను… మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి అని విద్యార్థులకు తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి (RDO Jaya Chandra Reddy) సూచించారు. శనివారం మండలంలోని కాళ్ళకల్ ఉన్నత పాఠశాలను (Chonakal High School) ఆయన సందర్శించారు. ముందుగా 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు. తట‌ప‌టాయించకుండా క్లుప్తంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని త్వరలో జరిగే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని విద్యార్థులకు సూచించారు.

మళ్లీ వస్తాను.. అడిగిన ప్రశ్నలకు అన్ని సూటిగా సమాధానాలు ఇవ్వాలి అని విద్యార్థులకు హితబోధ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడిచి పదవ తరగతిలో ఉత్తీర్ణులై మంచి పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం పాఠశాల హెచ్ఎం నర్సింగ్గం, ఉపాధ్యాయులతో ఆర్డిఓ మాట్లాడుతూ ఈసారి పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరగాలని సూచించారు. పలు రికార్డులను పరిశీలించారు.