లింగాయ‌త్‌ల మ‌ద్ద‌తు మ‌రువ‌లేనిది

జిల్లా భవ‌నం నిర్మాణానికి కృషి చేస్తా
ప్రతి ఎన్నికల్లో లింగాయత్ సమాజం నా వెంటే ఉంది..
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్‌

సంగారెడ్డి టౌన్‌, జనవరి 5(సిరి న్యూస్) : సంగారెడ్డి జిల్లాలో వీర‌శైవ లింగాయత్ భ‌వ‌న నిర్మాణానికి (construction of Veerashaiva Lingayat Bhavan
) నిధులు మంజూర‌య్యేలా కృషి చేస్తాన‌ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ (MLA Chinta Prabhakar) తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న వీరశైవ లింగాయత్ జిల్లా కార్యవర్గానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాతో సత్కరించారు.

ఈ సంద‌ర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే జిల్లా వీరశైవ లింగాయ‌త్‌ జిల్లా భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయించేవాడిన‌న్నారు. గత ప్రభుత్వం హ‌యాంలోనే మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో జిల్లా భ‌వ‌న‌ స్థలం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారినా జిల్లా భ‌వన నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తాన‌న్నారు. ప్రతి ఎన్నికల్లో లింగాయత్ సమాజం నా వెంట ఉండి నాకు పూర్తి మద్దతునిచ్చార‌ని తెలిపారు. వారి అభ్యున్న‌తికి క‌చ్చితంగా కృషి చేస్తాన‌ని హామీనిచ్చారు.