250మంది మహర్లు అసువులు బాసారు
కులవివక్ష,శ్రమదోపిడిని వ్యతిరేకంగా జరిగిన పోరాటం
అమరవీరులకు నివాళులర్పించిన మాజీ ఎంపీటీసీ మీనంపల్లి కిషన్ రావు
హత్నూర్ జనవరి 1 సిరి న్యూ స్ః భీమా కొరెగావ్ అమరవీరుల పోరాటం మరువలేనిదని సామాజిక ఉద్యమ నాయకులు,మాజీ ఎంపీటీసీ మీనంపల్లి కిషన్ రావు అన్నారు.శౌర్య దివస్ ను పురస్కరించుకుని బుధవారం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొరెగావ్ అమరవీరులకు నివాళులు అర్పించారు. 1818 జనవరి ఒకటిన 28000 మంది పీశ్వా సైన్యానితో వీరోచితంగా పోరాడి 5000మంది పీశ్వాలను హత మార్చిన పోరులో అసువులు బాసిన 250మంది మహర్ల త్యాగం మరువలేనిదన్నారు.
207ఏళ్ళక్రితం పీష్వా బ్రాహ్మణులు మహర్లపై కొనసాగించిన అంటరాని తనం,కులవివక్ష,శ్రమదోపిడిని వ్యతిరేకించడంతో జరిగిన ఆనాటి విరోచిత పోరాటానికి చిహ్నంగా మహారాష్ట్రలోని పూనా సమీపంలో బీమా నది ఒడ్డున బీమా కోరేగావ్ లో నిర్మించిన అమర వీరుల సంస్మరణ స్థూపం వద్ద డాక్టర్ అంబేడ్కర్ ప్రతిఏటా నివాళులు అర్పించేవారని ఆయన గుర్తచేశారు.సామజిక న్యాయం అందరి హక్కని,అది సాధించేందుకు ఎందరో మహానుభావులు చేసిన కృషి వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు రాగిబోగుడ నర్సిహ్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనంపల్లి సదానందం,తాల్క సుధాకర్, సీహెచ్ రాజు,గునుకుట్ల లింగం,తాల్క ఎల్లాదాసు తదితరులు పాల్గొన్నారు.