కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్

సంగారెడ్డి , జనవరి 20 ( సిరి న్యూస్ ) : ఈరోజు కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేజీకేఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్ ఆశన్న గౌడ్ కార్యదర్శులు ఎస్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత వృత్తి పై సుమారు 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాము. వృత్తిలో విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ బ్రతుకుతెరువు కోసం ధైర్యం చేసి వృత్తిని కొనసాగిస్తున్నాము. గత టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందేమో అని సంక్షేమ పథకాల ద్వారా సహకరిస్తుందేమో అని ఆశగా ఎదురు చూశాం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన వాటిని అమలు చేస్తారని అనుకున్నాం. 2024 అక్టోబర్ 18న రాష్ట్రస్థాయి సదస్సు హైదరాబాదులో జరిపి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ 22 డిమాండ్స్ ను రూపొందించి ప్రభుత్వానికి అందజేశాము.కానీ ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. వృత్తిలో ప్రమాదాలను నివారించడానికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ కిట్టును ప్రభుత్వం ఇస్తుంది అందుకు ధన్యవాదాలు కానీ ఇవి చాలా పరిమితంగా ఇస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సభ్యత్వం కలిగిన వాళ్లు రాష్ట్రంలో 2 లక్షల 50 వేల మంది ఉంటే 10 వేల మందికి మాత్రమే పంపిణీ చేశారు.

కొన్ని గ్రామాల వారికి ఇంకా రాలేదు. వచ్చిన గ్రామాలలో రెండు మూడు మాత్రమే ఇచ్చారు. మిగతా వాళ్లంతా ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఏడాది కాలంలో చనిపోయిన వారి కుటుంబాలకు, వికలాంగులైన వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా 7 కోట్ల 90 లక్షల రూపాయలు ఇప్పటివరకు బాధితులకు అందలేదు. ఎన్నికల ప్రణాళికలో నెల రోజుల లోపు ఎక్సిగ్రేషియా చెల్లిస్తామని, 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతామన్నారు. అన్నమాట ప్రకారం అమలు చేయాలి. ఏజెన్సీ ఏరియాలో వృత్తి చేస్తున్న గీత కార్మిక సొసైటీల పునరుద్ధరణ గురించి కూడా చర్యలు చేపట్టడం లేదు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనం లో గత ప్రభుత్వ హయాంలో నీరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 8 కోట్ల బడ్జెట్ కేటాయించింది. బిల్డింగ్, మిషనరీ నిర్మాణం పూర్తయింది కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు పడావు పడి ఉంది. నీరా మరియు తాటి ఈత అనుబంధ ఉత్పత్తులు అక్కడ తయారవుతాయి. వివిధ ప్రాంతాలకు సమృద్ధిగా నీరా ను బాటిలింగ్ చేసి పంపిణీ చేయవచ్చు. బుట్టలు, బ్యాగులు, దండలు తదితర ఫ్యాన్సీ వస్తువులను తయారుచేసి మార్కెటింగ్ చేయవచ్చు. ఫలితంగా గీత కార్మికులకి ఉపాధి కలుగుతుంది. హైదరాబాదు నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ ని టూరిజం శాఖ నుండి తొలగించి టాడి కార్పొరేషన్ కు అప్పగించినట్లయితే దీని ద్వారా వచ్చే లాభాలను గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల పెన్షన్ ను చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. ఇంకా ఇది ఆచరణ రూపం దాల్చలేదు. వృత్తిలో ప్రమాదాలు జరిగిన వారికి టాడి కార్పొరేషన్ నుండి ఇస్తున్న తక్షణ సహాయం దహన సంస్కారాల కొరకు 25,000లు, దెబ్బలు తగిలిన వారికి 10,000 బడ్జెట్ లేదనే పేరుతో నిలిపివేశారు. దీనిని కొనసాగించాలి.

గత ప్రభుత్వం గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని తమ ప్రభుత్వం అందరికీ ఇస్తుందని చెప్పారు. ఇవి ఏవి కూడా అమలు కాలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. వారు అన్నారు.ప్రమాద నివారణకు కాటమయ్య (కంఠ మహేశ్వర) రక్షణ కవచం వృత్తి చేసే వారందరికీ వెంటనే ఇవ్వాలి.సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. .ప్రమాద బాధితులకు పెండింగ్ ఎక్స్ గ్రేషియా డబ్బులు వెంటనే ఇవ్వాలి. ఎన్నికల హామీ ప్రకారం 10 లక్షలకు పెంచాలి.వృత్తిలో ప్రమాదాలు జరిగిన వారికిటాడికార్పొరేషన్ నుండి ఇచ్చే సహాయం నిలిపి వేశారు.దీనినికొనసాగించాలి.వృత్తి పెన్షన్ ఎన్నికల హామీ ప్రకారం4వేలకుపెంచాలి..నందనంలోని నీరా తాటి ఈత ఉత్పత్తుల ప్రాజెక్టును ప్రారంభించాలి.నెక్లెస్ రోడ్డు లోని నీరా కేఫ్ ని టాడీ కార్పొరేషన్కుఅప్పగించాలి.ఏజెన్సీ ఏరియాలోనిసొసైటీలను పునరుద్ధరించాలి.బెల్ట్ షాపులను నిరోధించాలి.

చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలి. వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రామా గౌడ్, సంగారెడ్డి మండలాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్, నాయకులు పవన్ గౌడ్ నారాయణ గౌడ్, మల్లేశం గౌడ్ లచ్చగౌడ్, సుదర్శన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు