ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు వినతిపత్రం అందజేత

జనవరి 21 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తండా, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామ గుడి తండా శివారులోని 80 ఎకరాల బీలాదాకాల భూముల సర్వే నంబర్ 633,634,635, 636,637,638,639,640,641, 642, 643, 644, లలో గిరిజనులు గత కొన్ని సంవత్సరాల నుండి కబ్జాలో ఉండి వ్యవసాయం తాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు కొంతమంది గిరిజనులకు ప్రభుత్వం 1997లో ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు జారీ చేసింది కొంత వారికి వారసత్వంగా వచ్చిన పట్టా భూములు , పీటి భూములను సాగు చేస్తూ వారి తాత ముత్తాతల నుండి శిస్తు పన్నులను కడుతూ భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నరు.

అట్టి భూములను అన్యాయంగా ఆక్రమంగా విక్రమ్ కుమార్ రెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి తమ పేరు మీద మార్చుకొని అపర్ణ,గ్రీన్ మార్క్,రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకొని, అట్టి భూములలో గిరిజనులకు రానివ్వకుండా గిరిజనులకు ఇబ్బంది పెట్టి భూముల జోలికొస్తే అన్యాయంగా ఆక్రమంగా రౌడీ షీటర్, 307 కేసులు నమోదు చేయించి గిరిజనులకు ఇబ్బందులు గురి చేస్తున్న అపర్ణ గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీల భూ ఆక్రమణలు అరాచకాల పై విచారణ చేపట్టి గిరిజనులకు ఇబ్బందుల గురి చేస్తున్న
అపర్ణ,గ్రీన్ మార్క్, అరబిందో ఫార్మా యజమాన్యం విక్రమ్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్, రెడ్డి నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డి లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఓడిఎఫ్ కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లకు వినతి పత్రం అందజేశారు . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల భూములపై విచారణ చేపట్టి సాగు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని వెలిమల,కొండకల్ తండాకు ఎస్సీ, ఎస్టి కమిషన్ సందర్శించి వారి సమస్యను పరిష్కారం చేయాలని తెలియజెశారు. ఈ కార్యక్రమం లో గిరిజన సంక్షేమ సంగం నాయకులు దినేష్ నాయక్, రవి, గోపి నాయక్, అకేష్ నాయక్ చందర్, శంకర్ నాయక్, రాకేష్ లు పాల్గొన్నారు.