లక్షల డప్పుల – వేల గొంతుల ప్రదర్శన వాయిదా

గజ్వేల్ ఫిబ్రవరి 05 (సిరి న్యూస్) : ఈనెల 7న చేపట్టాల్సిన వేల గొంతులు – లక్షల డప్పుల సాంసృతిక మహాప్రదర్శనను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వాయిదా పడిందని ఎంఎస్పి రాష్ట్ర నాయకుడు మైస రాములు మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం రోజు వారు గజ్వేల్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని మాదిగ, ఉప కులాల ప్రజలు గమనించాలని , ఎస్సీ వర్గీకరణకు శాసన సభ ఆమోదం తెలిపిన నేపథ్యంతో దానిలో జరిగిన లోపాలను సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉబ్బని ఆంజనేయులు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగె మహేష్, గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ శనిగారి రమేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత బొంది స్వామి, ఎమ్మార్పీఎస్ ములుగు మండల కమిటీ అధ్యక్షుడు ఆదాసు మహేష్, ములుగు మండల అంబేద్కర్ సంఘం నాయకులు నల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.