ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరిన సగర ఉప్పర సంఘం నాయకులు
సంగారెడ్డి, జనవరి 16 ( సిరి న్యూస్ ) : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 20 వ తేదీన సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అధితిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరు కావాలని ఆ సంఘం సభ్యులు ఎమ్మెల్యే ని కోరారు.
ముందుగా ఎమ్మెల్యే ని శాలువాతో సన్మానించి క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి రావాలని కోరారు.కార్యక్రమంలో సగర ఉప్పర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మురళీ కృష్ణ సగర, మధుసూదన్ రెడ్డి, ఉప అధ్యక్షులు రవి సగరమల్లేశం సగర, గోనే ప్రవీణ్ సగర, శ్రీనివాస్ సగర, పాండు సగర, సాయి కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.