వెలిమెలలోని భూములను గిరిజనులకే ఇవ్వాలి

అన‌ర్హుల‌కు ఇచ్చిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి….
ఈ భూములపై సమగ్ర దర్యాప్తు జరపాలి
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య

రామచంద్రపురం , జ‌న‌వ‌రి 16 సిరి న్యూస్ : వెలిమెల తండాకు సంబంధించిన భూములను పొజిషన్ లో ఉన్న గిరిజనులకే పట్టాలు ఇవ్వాలని , అన్హారుల కు ఇచ్చిన పట్టాలను తక్షణమే రద్దు చేయాలని, ఈ భూములపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే రాజయ్య డిమాండ్ చేశారు. ఆయన గురువారం తండాను సందర్శించారు . ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లల మధ్యల సరిహద్దు మధ్యలో ఉన్న భూమిని ఏకపక్షంగా అనర్హు ల కు పట్టాలి ఇచ్చారని, వీటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, అనేక సంవత్సరాలు నుంచి గిరిజనులు సాగులో ఉన్నప్పటికీ గిరిజనులు పట్టాలు ఇవ్వకుండా వేరే వారికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ భూములపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు, ప్రైవేట్ కంపెనీ చుట్టూ బౌండరీ కూడా పెట్టేటప్పుడు అనేకమంది పోలీసులను పెట్టి గోడపెట్టడం మరి అన్యాయమని అన్నారు. అంటే గిరిజన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు, ఒకరోజు పోలీస్ స్టేషన్కు గిరిజనులను తీసుకుపోవడం దుర్మార్గమని అన్నారు, అక్కడ మిగులు భూములు ఉన్న విషయం వాస్తవం, ఆ మిగులు భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు, పేదలకు ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపాలకు ఎలా ఇస్తారని అన్నారు. ఈ భూమి విషయంలో గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం అండగా నిలబడుతుందని, వాళ్ళ తరఫున ఉద్యమిస్తుందని ఆయన అన్నారు. ఈ భూముల సంబంధించింది అనేక కేసులు ఉన్నాయని, వాటి అన్నిటిని పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా అధికారులు వ్యవహరించారని ఆయన అన్నారు. గిరిజన తండాను సందర్శించి వారితో మాట్లాడడం జరిగిందని ఆయన అన్నారు. భూమిని కూడా పరిశీలించామన్నారు . చాలామంది పోలీసులు పెట్టి గోడ నిర్మిస్తున్నారని అన్నారు. అధికారులు వెంటనే గిరిజనలకు న్యాయం చేయాలనీ . లేని పక్షంలో పెద్దఎత్తున ఉధ్యమం చేపడతామని అన్నారు.