సంగారెడ్డి, జూన్ 1 (సిరి న్యూస్): ఎమర్జెన్సీ వార్డులో పవర్ సప్లై ఆగిపోయి, రోగులు ఇబ్బంది పడినట్టు, సెల్ ఫోన్ లైట్ వెలుతురులో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించినట్టు వో దిన పత్రిక లో వచ్చిన వార్తపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్, టీవీవీపీ కమిషనర్ ఘటనపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పవర్ కట్ సమయంలో జనరేటర్లు ఆన్ చేయకుండా ఆలస్యం చేసినట్టు విచారణలో తేలడంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మరోసారి అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Home జిల్లా వార్తలు సంగారెడ్డి జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ శ్రీధర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం