నారాయణఖేడ్, జనవరి 11 సిరి న్యూస్ : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుస్సురెడ్డి పల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్ లో ఇద్దరు ప్రేమికులు అద్దెకు తీసుకున్న రూంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మునిపల్లి మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి ఆత్మహత్య చేసుకున్న కర్పే ఉదయ్ కుమార్(21) మంగలి రోహిత (19) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తరలించగా శనివారం ఉదయం పోస్టుమార్టం పూర్తి చేసి రెండు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.ఒకే గ్రామానికి చెందిన కార్పే ఉదయ్ కుమార్, మంగలి రోహిత ఇలా మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరి సాంప్రదాయాల ప్రకారం వారి అంత్యక్రియలు నిర్వహించారు.