కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
రామాయంపేట జనవరి 17 (సిరి న్యూస్)
మెదక్ జిల్లా నార్సింగ్ మండల పరిధిలో ని నర్సంపల్లి చిన్న తండాలో ఐదు లక్షల రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను, నర్సంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, వల్లూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులనుఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు క్షేత్ర స్థాయిలో
పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. అధికారులు అధికార పార్టీ కి కొమ్ము కాస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిందం సబిత. మాజీ జడ్పీటీసీ సభ్యులు బాణాపురం కృష్ణారెడ్డి. మాజీ వైస్ ఎంపీపీ సుజాతా. మాజీ సర్పంచ్ బామ్మగారి భారతమ్మ సత్యం, చత్రియ నాయక్.ఆనందాస్ మహేశ్వరి నరేష్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుమ్మరి బాబు . భూపతిరాజు,రోమాల రాజు వహీద్ పాషా,నాయక్. కాలేరు యోగి. ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు