రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది

సర్పంచులకు బిల్లులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు
మాజీ సీఎం కేసీఆర్ కలిసి సమస్యలను వివరించిన చిన్న శంకరం పేట బిఆర్ఎస్ నాయకులు

చిన్నశంకరంపేట, జనవరి 6 సిరి న్యూస్ : చిన్న శంకరం పేట మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని, పనులు చేసిన సర్పంచులకు బిల్లులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వారు మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వెంట కాజాపూర్ మాజీ ఎంపీటీసీ బాచుపల్లి యాదగిరి తదితర టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.