రానున్న స్థానిక ఎన్నికల్లో యువత వైపే మొగ్గు చూపుతున్న ఓటరు…
గ్రామాల అభివృద్ధి యువతతోనే సాధ్యం…..
సీనియర్లకు చుక్కెదిరేనా…?
పాపన్నపేట : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడిప్పుడే సర్పంచ్ అభ్యర్థుల సందడి మొదలవుతుంది. యువత సన్నద్ధం కావాలని, రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా, మహానీయులను, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత అత్యధికంగా బరిలో నిలిచి, గ్రామాల అభివృద్ధి’యే యువతతో సాధ్యం అవుతుందని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రజలను చైతన్య పరుస్తూ, తెలంగాణా తొలి,మలిదశ ఉద్యమం అనేది విద్యార్థి, నిరుద్యోగ యువత తోనే ఉప్పెనలా ఎగిసిపడి యావత్ తెలంగాణ సమాజాన్నే చైతన్యం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో యువత పాత్ర అమోఘం, అద్భుతం అని గుర్తెరిగి తెలంగాణ ఉద్యమాన్ని, మహనీయులను స్పూర్తిగా తీసుకుని సమాజం లో అందరికి ఆదర్శంగా ఉంటూ, ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా, రాజకీయ పార్టీల నాయకుల మాటలకు, వారి ప్రలోభాలకు లొంగకుండా, గ్రామాల అభివృద్ధి యువత’ తోనే సాధ్యం అవుతుందని ప్రతి ఒక్క యువతి యువకులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి యువ శక్తి సత్తా ఏంటో నిరూపించుకోవాలని యువకులు వివిధ గ్రామాలలో ప్రజలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. మీకు ఏ సమస్య ఉన్నా మీకు అండగా ఉండి ఆదుకుంటామని ప్రజలకు వివరిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ జరగబోయే స్థానిక ఎన్నికల్లో సీనియర్లకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారనుంది.