ముఖ్య ప్రణాళిక అధికారి బదిలీ ఘనంగా వీడ్కోలు పలికిన గజిస్ట్రేట్ అధికారుల సంఘం

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 6 (సిరి న్యూస్):ముఖ్య ప్రణాళిక కార్యాలయం సంగారెడ్డి జిల్లా లో పని చేస్తున్నటువంటి డి.వెంకటరమణ, సహాయ సంచాలకులు ఉపసంచాలకులుగా పదోన్నతి పొంది హైదరాబాద్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గెజిటెడ్ అధికారుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్.డి.వైద్యనాథ్ డాక్టర్.సంతోష్ కుమార్, సహాధ్యక్షులు బలరాం, ఉపాధ్యక్షులు సాయిబాబా, పర్వతాలు ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకటరమణ, ని ఘనంగా సత్కరించారు. వెంకటరమణ భవిష్యత్తులో మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బాలశౌరి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.