ముచ్చర్లలో నాలుగు పథకాల ప్రొసీడింగ్స్ అందజేత..
హత్నూర : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తహసిల్దార్ ఫర్హీన్ షేక్ అన్నారు. హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఆయా పథకాల లబ్ధిదారులకు ఆదివారం స్పెషల్ ఆఫీసర్ స్వప్న ఎంపీడీవో శంకర్ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ నాలుగు పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగిన వారి పేర్లు రాకపోతే మళ్లీ అప్లై చేసుకుంటే వస్తదని పేర్కొన్నారు.
లిస్టులో పేరు లేకపోతే అధైర్య పడవద్దు అని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించనున్నట్లు తెలిపారు. వెటర్నరీ డాక్టర్ హేమలత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరే కృష్ణ, మాజీ ఎంపిటిసిలు కిషన్ రావు, రాజేందర్, మాజీ సర్పంచ్ యాదగిరి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సాయి, అజిజ్, ఏపీవో ప్రవీణ్, పంచాయతీ సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు.