సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలోని 28వ వార్డులో ప్రజా పాలనలో భాగంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రాని వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఖాళీ స్థలం ఉండి అప్లై చేసుకున్న వాళ్లు, రేషన్ కార్డులు, రేషన్ కార్డులో కొత్తగా చేర్పించుకునే వాళ్ళు, ఇదే చివరి రోజు కాదని ఇక్కడికి రాని వాళ్ళు మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని, లేనిపోని అపోహలను నమ్మవద్దని నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అర్హులందరికీ ప్రభుత్వం ప్రకటించిన అన్నీ కూడా వస్తాయని నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈరోజు ఈరోజు 28వ వార్డు ఇంచార్జ్ శ్రావణి, మాట్లాడుతూ..ఈరోజు లబ్ధిదారులు రేషన్ కార్డులు కొత్తవి 96, దరఖాస్తు చేసుకోగా కొత్తగా రేషన్ కార్డులో చేర్చుకునేందుకు 19 దరఖాస్తులు వచ్చాయని, అలాగే ఇందిరమ్మ ఇండ్లు 66 మందికి వచ్చినట్టు వార్డు ఇంచార్జ్ శ్రావణి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉమామహేశ్వరి, వార్డు కమిటీ మెంబర్ ప్రదీప్, మహేష్, సతీష్, వీణ, ప్రభాకర్ పాల్గొన్నారు.