ఘ‌నంగా ముక్కోటి ఏకాదశి.. ఆల‌యాల్లో కిక్కిరిసిన భ‌క్త‌జ‌నం

temples-are-rush-with-devotees-amid-vaikunta-ekadashi-celebrations
temples-are-rush-with-devotees-amid-vaikunta-ekadashi-celebrations

ప్రశాంత వాతావరణంలో ఉత్తర ద్వార దర్శనం..

సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలోని వైకుంటపురంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారం దర్శనం ప్రశాంతంగా కొనసాగుతోంది, వైకుంఠపురం దేవాలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని, వైకుంటపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను, అడుగడుగునా వాలంటీర్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్లు, పులిహోర, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, వైకుంఠపురం వాలంటీర్స్ ని ఏర్పాటు చేశారు.

ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని గంట గంటకి సంఖ్య పెరుగుతుండటంతో పోలీసు అధికారులు, ఆలయ సిబ్బంది, తగు జాగ్రత్తలు తీసుకుంటూ, దర్శనం ప్రశాంతంగా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా, ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే వైకుంటపురంలో, వచ్చే భక్తుల కోసం గాన కచేరి, భక్తి పాటలు తో ఆర్కెస్ట్రా, చిన్నపిల్లల కూచిపూడి నృత్యాలను ఎంతగానో చూపరులను ఆకట్టుకున్నాయి. చూడడానికి రెండు కళ్ళు చాలు అన్నట్టుగా వచ్చే భక్తులను కనువిందు చేస్తున్నారు. కూచిపూడి నృత్యం చిన్నారులు చిన్ని కృష్ణుడి వేషధారణలో అద్భుతమైన వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

దైవ దర్శనం, ఉదయం సమయంలో రెండు గంటల వరకు సమయం తీసుకున్నారు, భక్తుల సంఖ్య పెరగడంతో, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని వెంట వెంటనే భక్తులను పంపించడం జరిగింది. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం జరగకుండా పోలీసు శాఖ వారు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి రోడ్లపై ఎలాంటి వాహనాలు ఆపకుండా పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలవకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుపతిలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రశాంతమైన వాతావరణంలో గోవిందా గోవిందా నామస్మరణతో దద్దరిల్లిపోయింది. ప్రత్యేక ఆకర్షణగా ఆ గోవిందుడికి
రంగురంగుల పూలతో అలంకరించడంతో భక్తులు పులకించిపోయారు.