సంగారెడ్డి పట్టణంలో రూ.44కోట్ల‌తో అమృత్ జలపథకం ప్రారంభం

ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయాలనే సంకల్పం
మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగు కోసమే మహిళా శక్తి
ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి అమ్మాయి ఉన్నత చదువులు చదవాలి
మహిళలు చదువుకుంటే కుటుంబంలో వెలుగులు
దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్లు
దీంతో మహిళలు రాజకీయంగా కూడా రాణించే అవకాశం
ఎంపీ ర‌ఘునంద‌న్ రావు
మ‌హిళ‌లు ఆర్థికంగా అభివృద్ధి చెందాలిః టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దుకాణ సముదాయం ప్రారంభం
రాష్ట్రంలోని మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభించిన మంత్రి
11 అంబులెన్సు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన దామోద‌ర రాజ న‌ర్సింహ

సంగారెడ్డి, జ‌నవరి 3 సిరి న్యూస్ : సంగారెడ్డి పట్టణం లో పురపాలక శాఖ ఆద్వర్యం (Sangareddy municipal administration department) లో పట్టణం లో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయాలనే సంకల్పం తో 44 కోట్ల రూపాయలతో అమృత్ జల పథకాన్ని, మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి పథకాన్ని రాష్ట్రంలో చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Telangana health minister C Damodar Raja Narasimha) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా షాపింగ్ కాంప్లెక్స్ ను, స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లకు శంఖుస్థాపన కార్యక్రమము , మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మొట్టమొదటి మహిళా పెట్రోల్ పంపును మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ , టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు చేపట్టినప్పటికీ మహిళల్లో అనుకున్న స్థాయిలో ఆర్థికంగా ఎదగలేకపోతున్నారన్నారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు .అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి పథకాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పథకం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళ క్యాంటీన్ల ఏర్పాటు ,పెట్రోల్ పంపు ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లాంటి పథకాలను చేపట్టిందన్నారు. మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి అమ్మాయి ఉన్నత చదువులు చదవాలన్నారు మహిళలు చదువుకుంటే కుటుంబాల్లో పెను మార్పులు సంబ‌విస్తాయన్నారు.

దీంతో గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కుటుంబంలో మహిళలు చదువుకుంటే ఆర్థిక స్థిరత్వం కలుగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు ప్రభుత్వ కాంట్రాక్టులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తాం అని మహిళలు ముందుకు వచ్చే విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం కలెక్టరెట్ కార్యాలయాల లో 11 అంబులెన్సు వాహనాలకు మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పెట్రోల్ పంపు, మహిళ షాపింగ్ కాంప్లెక్స్ మంజూరు చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు సహకరించిన అధికారులకు ఈ సందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే మహిళలకు ప్రభుత్వం 50% రిజర్వేషన్ కల్పించిందని రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ రానున్నట్లు ఎంపీ తెలిపారు దీంతో మహిళలు రాజకీయంగా కూడా రాణించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడానికి మహిళలు ఇప్పటి నుండే ముందుకు రావాలన్నారు. మహిళలు ఆత్మనూన్యతా భావం నుండి బయటపడాలన్నారు.

టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి లు మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం మహిళా శక్తి పథకంలో పెట్రోల్ పంపు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం మహిళలకు ఆర్థిక అభివృద్ధికి దోవాదం చేస్తుందన్నారు షాపింగ్ కాంప్లెక్స్ ను పెట్రోల్ పంపులు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు మహిళ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు అందుబాటులో ఉండన్నట్లు తెలిపారు వారి సమస్యలతో దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం చేపట్టిన మహిళా శక్తి పథకం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు ప్రాంతీయ రాష్ట్రంలోనే మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా మహిళలకు మొట్టమొదటి పెట్రోల్ పంపు జిల్లాలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో ఎన్నో మంచి పథకాలు ఉన్నాయన్నారు. వాటిని జిల్లాలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈవెంట్ ప్రోగ్రాం నిర్వహణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు . మహిళలకు శిక్షణ ఇచ్చి బ్యాంకు లింకేజీల ద్వారా లోన్ ఇవ్వడం మహిళలు ఎదగడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో డిమాండ్ ఉన్న యూనిట్స్ నెలకొల్పి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు పిల్లలు పెద్ద పెద్ద యూనిట్లు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు ఆర్థికంగా ఎదగడానికి ఆదాయం పెంపొందించుకునే మార్గాలు సూచించుకోవాలని ఇతరులకు ఆదర్శంగా నిలబడాలని పేర్కొన్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్ ఏర్పాటు ద్వారా మహిళల కలలు సహకారం అయిందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి హరీష్ రావు మహిళా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ కోసం రూ.75 లక్షలు మంజూరు చేసినట్లు, అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన 75 లక్షలకు అదనంగా 29 లక్షలు మహిళా సమాఖ్య ద్వారా ఖర్చుచేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం గర్వించదగ్గ రాష్ట్రంలోనే మొదటి పెట్రోల్ పంపు తన సంగారెడ్డి నియోజకవర్గంలో మహిళ శక్తి పథకంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ విజయలక్ష్మి ,కార్పోరేషన్ చైర్మన్లు , అదనపుకల్లెక్టర్ చంద్రశేఖర్ డిఆర్డిఓ జ్యోతి , ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి , ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి రామ్ ఇప్పిలి , కార్పోరేషన్ చైర్మన్లు , సి డి సి చైర్మన్లు సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.