పెద్ద శంకరంపేట : పెద్ద శంకరంపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తపస్ ఉపాధ్యాయ సంఘం 2025 సంవత్సర నూతన క్యాలెండర్, డైరీ నీ సోమవారం సాయంత్రం మండల విద్యాధికారి డి వెంకటేశం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షులు రవి మాట్లాడుతూ జాతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పంచ పరివర్తనను క్యాలెండర్లో ప్రచురించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, విట్టల్, విజయ్ కుమార్, తపస్ మండల ప్రధాన కార్యదర్శి కాన్షీరామ్ జాదవ్, ఉపాధ్యాయులు సుధీర్, రాధిక, భారతి, ప్రవీణ్ కుమార్, అనిత, అశ్విని, మారుతి, సిద్ధిరాములు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.