రామాయంపేట జనవరి 12 (సిరి న్యూస్) : వివేకానంద 162 వ జయంతి (Swami Vivekananda Jayanti Celebrations) సందర్భంగా రామాయంపేట పట్టణంలో సిద్దిపేట ఎక్స్ రోడ్ నందు వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈకార్యక్రమంలో నూతన మున్సిపాలిటీ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి , మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వివేకానందుడి స్ఫూర్తి యువతకు ఆదర్శం కావాలని వివేకానందుడు చికాగో బహిరంగ సభలో ఉక్కుమనిషి ఇనుప కండరాలు గల యువత దేశానికి ఒక ఐదుగురు అయితే చాలని దేశాన్ని ధర్మాన్ని కాపాడుతూ యువతను సక్రమ మార్గంలో నడిపిస్తారని వారు అన్నారని తెలిపారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో యువత రాజకీయాల్లోకి రావాలని వివేకానందుని అడుగుదాడల్లో అవినీతి లేని పాలన అందించడానికి యువత ముందుకు రావాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ అసెంబ్లీ కాంటెస్ట్ఎమ్మెల్యే పంజా విజయ్ కుమార్ ,రాష్ట్ర నాయకులు వెలుముల సిద్దరాములు,జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఓబీసీ రాష్ట కార్యవర్గ సభ్యులు చిoతల శేకర్, సీనియర్ నాయకులు శ్రీరామ్ ముత్యాయ, దామోదర్రావు,బిజెపి నూతన మండల ప్రెసిడెంట్ నవీన్, పట్టణ నాయకులు నాగరాజు, శంకర్ గౌడ్, బిజెవైఎం మండల నాయకులు కుమ్మరి రమేశ్,బూత్ ప్రెసిడెంట్స్ మహేష్,శ్యములు,కటిక కార్తిక్, కన్నయ,సతీష్ రావు, కనక రాజు,బాసం అనిల్, సందిప్,తదితరులు పాల్గన్నారు.