హత్నూర: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకం అమలుపై హత్నూర తహసిల్దార్ ఫర్విన్ షేక్ ఆధ్వర్యంలో సోమవారం సర్వే చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ ఆమోదయోగ్యం ఉన్న సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నట్లు తహసిల్దారు పేర్కొన్నారు. వెంచర్లకు, ఫ్లాట్లకు, సాగు చేయని భూములను గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించనున్నట్లు సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా కింద సాగుకు ప్రభుత్వ సహాయం రైతులకు అందుతుందని ఆమె పేర్కొన్నారు. సెలవు దినమైనప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.